వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణాష్టమి వేడుకలకు హిరమండలంలోని కూర్మ గ్రామం ముస్తాబవుతోంది. సెప్టెంబరు 4 నుంచి రెండురోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి రోజు ఉదయం 4.30 గంటలకు హారతితో కార్యక్రమాలు ప్రారంభమై అర్ధరాత్రి 12.30 గంటల వరకు కొనసాగుతాయి. మరుసటి రోజు నగర సంకీర్తనలు, ప్రవచనాలు, మంగళహారతి నిర్వహించనున్నారు. భక్తులు, దాతలు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

