Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 30, 2026 2:54 PM రాజన్న సిరిసిల్లGeneral
సెప్టెంబర్ 1న రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ - Udayam
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సెప్టెంబర్ 1వ తేదీన సిరిసిల్ల లో పర్యటించనున్నారు. కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట్ల ప్రవీణ్ మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి చేరుకోనున్నారు. జిల్లా ఉన్నతాధికారులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...