Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవులను ఆసరాగా చేసుకొని పాఠశాలలో చోరికి యత్నం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 10:30 AM వికారాబాద్తెలంగాణ
సెలవులను ఆసరాగా చేసుకొని పాఠశాలలో చోరికి యత్నం - Udayam
బొంరాస్ పేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం రాత్రి చోరీ యత్నం జరిగింది. వరుస సెలవులను ఆసరాగా చేసుకుని దొంగలు పాఠశాల తాళాలు పగులగొట్టేందుకు యత్నించారు. మంగళవారం ఉదయం గుర్తించిన హెచ్‌ఎం చందర్, ఎంఈఓ శంకర్‌కు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న బడిలోనే చోరీకి యత్నించడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...