వార్తలకు తిరిగి వెళ్లండి

అయిజ మండలంలో నిబంధనలకు విరుద్ధంగా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం ఎమ్మార్సీ సిబ్బందికి వినతిపత్రం ఇచ్చారు.
పలు పాఠశాలల్లో విద్యార్థులను రాత్రి వరకు ఉంచుతున్నారని తెలిపారు. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొని, నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

