Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడు ఎర్రచందనం దుంగల స్వాధీనం

Follow Udayam on Google
రేఖ దేవి Jul 28, 2026 12:32 PM అన్నమయ్యGeneral
ఏడు ఎర్రచందనం దుంగల స్వాధీనం - Udayam
అన్నమయ్య జిల్లా సానిపాయి రేంజ్‌ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 112 కిలోల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నంలో నిందితులు దానిని వదిలేసి పరారైనట్లు తెలిపారు. వాహనంలో ఏడు ఎర్రచందనం దుంగలు లభించాయని, వాటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...