Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండోరోజు శిక్షణ

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 12, 2026 5:11 PM పశ్చిమగోదావరి General
అంగన్‌వాడీ కార్యకర్తలకు రెండోరోజు శిక్షణ - Udayam
తాడేపల్లిగూడెం టీఎస్‌ఎం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు బుధవారం రెండోరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల శారీరక, మానసిక పరిపక్వత, పురోగతిని తల్లిదండ్రులకు వివరించాలని ఎస్‌జీటీలు జి.రాజశేఖర్‌, టి.సన్యాసిరావు సూచించారు. టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌, రిమోట్‌ లెర్నింగ్‌ సందేశాలపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు ఎస్తేరు రాణి, శ్రీదేవి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...