Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడి కోసం గాలింపు తీవ్రం

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 12, 2026 9:46 PM హైదరాబాద్క్రైమ్
షాబాద్ ఆరు హత్యల కేసు నిందితుడి కోసం గాలింపు తీవ్రం - Udayam
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా హతమార్చిన ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. పోక్సో కేసు కక్షతో బాలిక కుటుంబంతో పాటు తన భార్యాపిల్లలను నిందితుడు కిరాతకంగా చంపేశాడు. నిందితుడిని పట్టుకోవడానికి 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ జాతీయ రహదారులు, లాడ్జీల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ఫ్యూచర్‌ సిటీ పోలీసులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన షాబాద్ ఎస్సై రమేశ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Comments

G
Loading comments...