Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణలో పాఠశాలల ప్రారంభం

Sonia Singh Jun 15, 2026 4:03 AM హైదరాబాద్ 8 viewsabout 6 hours ago
తెలంగాణలో పాఠశాలల ప్రారంభం - Udayam Digital
తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల సందడితో బడులు కళకళలాడుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,269 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్‌భవన్ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. దాదాపు 1.44 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తొలిరోజే విద్యార్థులకు కొత్త పుస్తకాలు, నోట్‌బుక్కులను పంపిణీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...