Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల దాహం తీర్చేందుకు దాతల ముందడుగు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 7:07 PM సూర్యాపేటGeneral
విద్యార్థుల దాహం తీర్చేందుకు దాతల ముందడుగు - Udayam
సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో దాతల సాయంతో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని ఆయన అన్నారు. గ్రామాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నవారు మండలంలోని పాఠశాలలను దత్తత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జొన్నలగడ్డ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...