వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం గత రెండేళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతోంది. గతంలో నిర్మించిన భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో అద్దె భవనానికి మార్చారు.
అద్దె భవనంలో సరైన వసతులు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత విద్యార్థినులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి నూతన వసతి గృహ భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

