వార్తలకు తిరిగి వెళ్లండి
శాఫైర్ ఫుడ్స్ లాభాల బాట

డిస్కౌంట్లు, చౌక ఆఫర్ల ద్వారా కస్టమర్లను ఆకట్టుకోవడంతో పిజ్జా హట్, కేఎఫ్‌సీ ఫ్రాంచైజీ 'శాఫైర్ ఫుడ్స్' ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ. 14.04 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ రూ. 1.8 కోట్ల నష్టాన్ని నమోదు చేయగా, ఈ త్రైమాసికంలో ఆదాయం 15% పెరిగి రూ. 891 కోట్లకు చేరింది.
కంపెనీ వ్యయాలు 12% పెరిగినప్పటికీ, అమ్మకాలు ఊపందుకోవడంతో లాభాల్లోకి అడుగుపెట్టింది.
Comments
Loading comments...