Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో ఇసుక దందా

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 23, 2026 6:31 AM తూర్పుగోదావరి General
గోదావరిలో ఇసుక దందా - Udayam
పి.గన్నవరం వద్ద వైనతేయ గోదావరి లంక భూముల్లో అక్రమ ఇసుక తోలకాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకు వందలాది టిప్పర్లలో కోట్లాది రూపాయల విలువైన ఇసుకను రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారు. టిప్పర్ల రాకపోకలతో రోడ్లు పాడై వాహనదారులు ప్రమాదాల బారిన పడుతుండటం కలకలం రేపుతోంది. ఒక ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...