Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఇసుక మాఫియా దందా

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 20, 2026 8:21 AM బాపట్లGeneral
జిల్లాలో ఇసుక మాఫియా దందా - Udayam
బాపట్ల, చీరాల మండలాల సరిహద్దుల్లో అనుమతులు లేకుండా అసైన్డ్ భూముల్లో ఇసుక మాఫియా జోరుగా అక్రమ తవ్వకాలు సాగిస్తోంది. తవ్విన ఇసుక, బుసకను లారీలు, ట్రాక్టర్లలో తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. స్థానికులు, గ్రామస్థులు అడ్డుకుని ఫిర్యాదు చేసినా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు కేవలం నోటీసులతో సరిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్పందించిన గనుల శాఖ ఏడీ తవ్వకాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Comments

G
Loading comments...