వార్తలకు తిరిగి వెళ్లండి

మానేరు తీరం నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. వర్షాకాలం కోసం అక్రమార్కులు గ్రామాల్లో భారీ డంపులు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులను సైతం లెక్కచేయకుండా మాఫియాగా ఏర్పడి దందాను కొనసాగిస్తున్నారు.
దీనిని అరికట్టేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి వాహనాలను సీజ్ చేస్తున్నారు. తీర ప్రాంత గ్రామాల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా నిరోధిస్తామని పోలీసులు ప్రకటించారు.
Comments
Loading comments...

