Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీతాలు లేక ఆర్థిక కష్టాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 10:52 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
జీతాలు లేక ఆర్థిక కష్టాలు - Udayam
జిల్లాలో ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులకు మూడు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, రుణ వాయిదాలు భారంగా మారాయని వారు తెలిపారు. పెండింగ్‌ వేతనాలను వెంటనే విడుదల చేయాలని క్షేత్ర సహాయకులు కోరుతున్నారు. ప్రభుత్వం గ్రాంట్‌ విడుదలలో జాప్యం కారణంగా బకాయిలు నిలిచాయని, నాలుగు రోజుల్లో చెల్లించే అవకాశం ఉందని డీఆర్డీవో విద్యాచందన తెలిపారు.

Comments

G
Loading comments...