Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 6:48 PM జగిత్యాలGeneral
 సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ - Udayam
నవంబర్ నెలంతా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించి, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, పెట్టుబడి మోసాలు, స్క్రీన్ షేరింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, యూపీఐ పిన్ ఎవరికీ చెప్పవద్దని, అనుమానాస్పద లింకులు తెరవవద్దని హెచ్చరించారు. మోసపోతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...