Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:17 PM ఏలూరుGeneral
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ - Udayam
సైబర్ నేరాల కట్టడికి బ్యాంకులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఏలూరు సబ్‌డివిజన్ డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ సూచించారు. ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో గురువారం బ్యాంకర్లతో సమావేశమయ్యారు. నకిలీ కేవైసీ, ఫిషింగ్ లింకులు, లోన్ యాప్ మోసాలపై ఖాతాదారులను అప్రమత్తం చేయాలని సూచించారు. మోసం జరిగిన వెంటనే 1930 లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేస్తే రికవరీ సులువవుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...