Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాయికృష్ణది లాకప్‌ డెత్‌: సిట్ నివేదిక

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 24, 2026 4:47 PM విజయవాడGeneral
సాయికృష్ణది లాకప్‌ డెత్‌: సిట్ నివేదిక - Udayam
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆయనది లాకప్‌ డెత్ అని సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించారు. పోలీసు కస్టడీలో చిత్రహింసల వల్లే సాయికృష్ణ మరణించాడని ప్రాథమిక విచారణలో తేలింది. సీసీ ఫుటేజీని డిలీట్ చేసి, మృతదేహాన్ని మాయం చేశారని సిట్ పేర్కొంది. సీఐ నాగరాజు దర్యాప్తునకు సహకరించడం లేదని, నిందితులు తప్పుడు సమాచారంతో కేసును పక్కదారి పట్టిస్తున్నారని నివేదికలో సంచలన విషయాలను బయటపెట్టారు.

Comments

G
Loading comments...