Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:58 AM జాతీయంGeneral
అయ్యప్ప దర్శనానికి పోటెత్తిన భక్తులు - Udayam
మలయాళ నూతన సంవత్సరం, చింగం మాసం ప్రారంభం సందర్భంగా సోమవారం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. చింగం మాస పూజలు ఆగస్టు 21 వరకు కొనసాగనున్నాయి. ఓనం పూజల కోసం ఆగస్టు 24న ఆలయం మళ్లీ తెరుస్తారు. భక్తులు దర్శనానికి ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...