Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగు ఖర్చులు తగ్గించేలా వ్యవసాయ అధికారుల సూచనలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 6:57 PM పల్నాడుGeneral
సాగు ఖర్చులు తగ్గించేలా వ్యవసాయ అధికారుల సూచనలు - Udayam
ముప్పాళ్ళ, గొల్లపాడు గ్రామాల్లో బుధవారం "పొలం పిలుస్తుంది" కార్యక్రమం నిర్వహించారు. జిల్లా డాట్ సెంటర్ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ నగేష్, ఏడీఏ రవిబాబు పాల్గొన్నారు. ప్రత్తిలో లింగాకర్షక బుట్టలకు వరుసగా 3 రోజులు 8 మగ పురుగులు చిక్కితేనే మందులు పిచికారీ చేయాలని, కందిలో ఎల్.ఆర్.జి రకాలు వాడాలని సూచించారు. ప్రతి రైతు తప్పక ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని కోరారు. ఏఈఓ శేషుబాబు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...