వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ నీరు సక్రమంగా రాకపోవడంతో యాసంగి సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. దీంతో అనంతగిరి మండలంలో పంట పొలాల్లోని బావులకు మళ్లీ పూడికతీత పనులు చేపడుతున్నారు. ప్రత్యామ్నాయ నీటి వనరుగా బావులను సిద్ధం చేసుకుంటున్నారు.
గతంలో కాలువల ద్వారా నీరు అందడంతో బావులను పూడ్చి సాగు చేసేవారు. మండలంలో 14,146 ఎకరాల్లో వరి సాగు కాగా, గతేడాదితో పోలిస్తే ఈసారి 40 శాతం వరకు తగ్గినట్లు సమాచారం.
Comments
Loading comments...

