Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.75 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం ప్రారంభం

Follow Udayam on Google
B Ganga Sep 03, 2026 7:10 PM పార్వతీపురం మన్యంGeneral
రూ.75 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం ప్రారంభం - Udayam
సీతంపేట మండలంలోని గౌరిపొలం గూడలో రూ.75లక్షలతో నిర్మించిన బహుళ ప్రయోజన కమ్యూనిటీ భవనాన్ని MLA నిమ్మక జయకృష్ణ ప్రారంభించారు. పీఎం జన్మన్ ద్వారా రూ.60 లక్షలు, ఆర్ట్స్ సంస్థ ద్వారా రూ.15 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో స్మార్ట్ అంగన్వాడీ, కమ్యూనిటీ హాల్, హెల్త్ హాల్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ భవనం గిరిజన ప్రజలకు విద్య, వైద్యం, చిన్నారుల సంరక్షణ, సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...