Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.10 లక్షల ఐకేపీ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు

Follow Udayam on Google
madhu Aug 25, 2026 9:36 PM ములుగుGeneral
రూ.10 లక్షల ఐకేపీ భవనం చుట్టూ పిచ్చి మొక్కలు - Udayam
కన్నాయిగూడెం మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మిస్తున్న ఐకేపీ భవనం పనులు నత్తనడకన సాగుతున్నాయి.భవనం చుట్టూ పిచ్చిమొక్కలు, ముళ్లచెట్లు దట్టంగా పెరిగి అస్తవ్యస్తంగా మారింది. పాములు చేరతాయని మహిళలు భయపడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. పనులు త్వరగా పూర్తిచేసి శుభ్రం చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

Comments

G
Loading comments...