వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం: మంత్రి పొన్నం
నిహారిక రెడ్డి Jun 28, 2026 6:47 AM హైదరాబాద్ 6 viewsabout 2 hours ago

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంచేశారు. జులై నెల జీతాల నుంచే 11% పీఆర్సీ అమల్లోకి వస్తుందని, త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు.
ఏపీలో విలీనం తర్వాత వచ్చిన ఇబ్బందులు తెలంగాణలో రాకుండా ఉండేందుకే విలీన కమిటీలో గుర్తింపు సంఘాల నేతలను చేర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు. కొందరు నాయకులు ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం బాధ్యతారాహిత్యమని మంత్రి విమర్శించారు.
Comments
Loading comments...