Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.586 కోట్లతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు

Follow Udayam on Google
పార్వతి దేవి Jun 28, 2026 12:19 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
రూ.586 కోట్లతో భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు - Udayam
దక్షిణ అయోధ్య భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మాడవీధిలోని పాత గోడను తొలగించి, వైదిక పెద్దల పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పనులను ప్రారంభించారు. ప్రభుత్వం మూడు విడతలుగా రూ.586 కోట్లు మంజూరు చేసిందని, 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అంకిత్ సూచించారు.

Comments

G
Loading comments...