Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Jul 29, 2026 11:24 AM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు - Udayam Digital
పాయకరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు వడ్డించేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. గుడ్ల నుంచి దుర్వాసన రావడంతో ఉపాధ్యాయులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఎంఈఓ-2 రమేష్‌బాబు తెలిపారు. నిర్వాహకులను మార్చనున్నట్లు వెల్లడించగా, భోజన పథకంపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీఈఓ అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...