వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల విద్యానగర్‌కు చెందిన గర్భిణి రమ్య, స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో మే నెలలో ఇచ్చిన కోడిగుడ్లు పాడైపోయినట్లు గుర్తించింది. అనుమానంతో ఆమె ఆ గుడ్లను నీటిలో వేయగా, రెండు మూడు తప్ప మిగిలినవన్నీ పైకి తేలడంతో ఆందోళనకు గురైంది.
కుళ్లిన కోడిగుడ్లు పంపిణీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రమ్య కుటుంబ సభ్యులు, ఆమెతో కలిసి అంగన్‌వాడీ టీచర్‌ను నిలదీశారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంతో ఇలా ఆటలాడటంపై స్థానికులు మండిపడుతున్నారు.
Comments
Loading comments...

