Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డే కూలీల అడ్డా.. ట్రాఫిక్‌కు తిప్పలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:46 PM రంగారెడ్డి General
రోడ్డే కూలీల అడ్డా.. ట్రాఫిక్‌కు తిప్పలు - Udayam
షాద్‌నగర్‌–జడ్చర్ల రోడ్డు చౌరస్తాలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వందలాది మంది కూలీలు రోడ్డుపైనే గుమిగూడుతున్నారు. ప్రత్యేక అడ్డా లేకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలిపారు. కూలీల కోసం ప్రత్యేక అడ్డా ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...