వార్తలకు తిరిగి వెళ్లండి

యు.కొత్తపల్లి మండలం గోర్స నుండి ఆనందనగర్ వెళ్లే మార్గ మధ్యలో ఈదురుగాలుల కారణంగా భారీ వృక్షం నేలకూలింది. దీంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న యు.కొత్తపల్లి ఎస్సై వెంకటేశ్ బృందం, ఆర్ & బీ అధికారులతో చేరుకొని యుద్ధప్రాతిపదికన చెట్టును తొలగించారు.
అనంతరం వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పరిస్థితిని పోలీస్, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

