వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస జాతీయ రహదారిపై రాఖీ పండగ రోజున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం మాకన్నపల్లి జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మామిడిమెట్టు గ్రామానికి చెందిన చెల్లూరు బైరాగి (60) అక్కడికక్కడే మృతి చెందారు.
ఆయన భార్య దమయంతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

