Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 9:14 AM కామరెడ్డిGeneral
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని సిద్ధాపూర్ చెరువు కట్టపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు చిల్లర్గి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఉస్మాన్ (57) ఆటోలో బాన్సువాడ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన 2 కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.

Comments

G
Loading comments...