వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అనుపురం గ్రామానికి చెందిన చింతకింది నరసయ్య (60) ఎక్స్‌ఎల్ బండిపై సీసీ రోడ్డులో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పింది.
రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ పైపును ఢీకొనడంతో నరసయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

