Udayam Digital
Menu

రోడ్డు ప్రమాదంలో నటులకు గాయాలు

Shruthi Nov 22, 2026 2:00 PM పశ్చిమగోదావరి General
రోడ్డు ప్రమాదంలో నటులకు గాయాలు - Udayam Digital
పాలకోడేరు మండలం పెన్నాడలో కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో జబర్దస్త్ నటులు దొరబాబు, రైజింగ్ రాజు గాయపడ్డారు. కాకినాడ నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోగా, డ్రైవర్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, క్షతగాత్రులను భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...