వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి చెందారు. తూ.గో. జిల్లా ఉండ్రాజవరానికి చెందిన వంశీకృష్ణ, తన భార్య లావణ్య (22), కుమార్తె కీర్తన (2)తో కలిసి వెళ్తుండగా ప్రైవేటు పాఠశాల వద్ద స్పీడ్ బ్రేకర్లపై బైక్ అదుపుతప్పింది.
సమీపంలోని స్తంభాన్ని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన తల్లీకూతుళ్లు కన్నుమూశారు. వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో తణుకులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

