Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో వ్యక్తి మృతి

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 30, 2026 4:52 PM సిద్దిపేటGeneral
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో వ్యక్తి మృతి - Udayam
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం క్రాసింగ్ గ్రామ పరిధిలోని రాజీవ్ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...