Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదం: భర్త కళ్లముందే భార్య మృతి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 29, 2026 2:39 PM విశాఖపట్నంGeneral
రోడ్డు ప్రమాదం: భర్త కళ్లముందే భార్య మృతి - Udayam
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరం వెళ్తున్న దంపతుల బైక్‌ను వెనుక నుంచి వ్యాన్ ఢీకొట్టింది. ఆ వ్యాన్ అదుపుతప్పి లారీని ఢీకొనడంతో, వాహనాల మధ్య నలిగి గాయత్రి (24) అక్కడికక్కడే మృతి చెందింది. భర్త ఈశ్వరరావు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Comments

G
Loading comments...