వార్తలకు తిరిగి వెళ్లండి

తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడేందుకు రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుట్టారు.
శ్రీకాకుళంలో బుధవారం ఇంజనీర్స్ డేను పురస్కరించుకుని ఈనెల 14 వరకు హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు విశ్రాంత సీఈవో పల్లి శ్రీరాములు తెలిపారు. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమని, స్వచ్ఛంద రక్తదానమే మార్గమని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు అన్నారు. యువత పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

