వార్తలకు తిరిగి వెళ్లండి
ధరల మంట: మళ్లీ పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

మే నెలలో 3.93 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్‌లో ఒక్కసారిగా 4.38 శాతానికి చేరింది. ఆరు నెలల గరిష్టానికి చేరిన ఈ గణాంకాలు ఆర్‌బీఐ నిర్దేశిత నాలుగు శాతం లక్ష్యాన్ని దాటడం ఆందోళన కలిగిస్తోంది.
ముఖ్యంగా ఆహార ధరలు 5.32 శాతానికి పెరగడం దీనికి కారణమైంది. హోటల్ భోజనాలు, రవాణా ఖర్చులు భారీగా ప్రియమవ్వడంతో సామాన్యుడిపై అదనపు భారం పడింది.
Comments
Loading comments...