Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ నిప్పులు

Follow Udayam on Google
రవళి దేవి Jul 13, 2026 5:26 PM జాతీయంGeneral
భారత విద్యా వ్యవస్థపై రాహుల్ గాంధీ నిప్పులు - Udayam
భారత్‌లో విద్యా వ్యవస్థ మోసపూరితంగా, దోపిడీ యంత్రాంగంగా మారిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థలోని అవినీతి వల్లే పేపర్ లీకేజీ మాఫియా పురుడు పోసుకుందని, విద్యార్థుల కష్టాన్ని దోచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై ప్రధాని మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించారని ఆయన ఆరోపించారు. విద్యా వ్యవస్థ కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెడుతోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...