వార్తలకు తిరిగి వెళ్లండి
మేడిగడ్డకు పెరుగుతున్న వరద ప్రవాహం

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం 1,02,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో అధికారులు మొత్తం 85 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ ప్రవాహమంతా ప్రధానంగా ప్రాణహిత నది నుంచే వస్తోందని అధికారులు తెలిపారు. మరోవైపు కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేసి నీటిని తరలించాలని బిఆర్ఎస్ (BRS) డిమాండ్ చేస్తోంది.
Comments
Loading comments...