వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ప్రజాపోరాటాలు చేయాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాల బీజేపీ కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ తరహాలోనే కార్యకర్తల కృషితో తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పోరాటం ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Comments
Loading comments...

