వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రహదారుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. నల్గొండ జిల్లా కనగల్ వేదికగా రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్&బీ చేపట్టనున్న హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణ పనుల పైలాన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించి, శంకుస్థాపన చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ విధానంలో 441 రోడ్లను ఉన్నతీకరించనుండగా.. ఒక్క నల్గొండ జిల్లాలోనే రూ.1,100 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...

