వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ రిమ్స్ SNCUలో అగ్నిప్రమాదంలో 5 రోజుల పసికందుతో సహా ఇద్దరు చిన్నారులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత Xలో పేర్కొన్నారు. ఇది 100% ప్రభుత్వ నిర్లక్ష్య మేనన్నారు. జనం బాటలో రిమ్స్ ను సందర్శించినప్పుడే సదుపాయాల లేమిని
ఎత్తిచూపి మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశామని, ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి అన్ని ఆస్పత్రుల్లో సౌకర్యాలు పటిష్టం చేయాలన్నారు.
Comments
Loading comments...

