వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగరంలోని రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు సోమవారం రిమ్స్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు మాట్లాడుతూ, రాజకీయ జోక్యంతోనే వైద్యులు, సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రిమ్స్‌లో సరైన వైద్యం అందకపోవడంతో రోగులను విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

