Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రికార్డు ధర పలికిన మక్కలు

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:34 AM మహబూబాబాద్ General
రికార్డు ధర పలికిన మక్కలు - Udayam
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ ఓపెన్‌ యార్డులో మంగళవారం మక్కల పంటతో కళకళలాడింది. సీజన్‌ ప్రారంభం కావడంతో చుట్టుపక్కల రైతులు పంటను విక్రయానికి తీసుకొచ్చారు. 955 బస్తాలు మార్కెట్‌కు రాగా క్వింటాకు గరిష్టంగా రూ.2,789, కనిష్టంగా రూ.2,100 ధర పలికింది. మక్కలకు మద్దతు ధర రూ.2,410 ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తేమ తగ్గి గిట్టుబాటు ధర లభించేందుకు రైతులు ఓపెన్‌ యార్డులో మక్కలను ఆరబోస్తున్నారు.

Comments

G
Loading comments...