వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు శనివారం గరివిడి తహశీల్దారు కార్యాలయంలో రీసర్వే భూములు గల రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భూమిపై హక్కు కల్పించే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం రీసర్వే చేయించి రాజముద్ర కలిగిన పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. అలాగే గ్రామాల్లో భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తహశీల్దారు బంగారు రాజుకు ఆయన సూచించారు.
Comments
Loading comments...

