వార్తలకు తిరిగి వెళ్లండి

జియ్యమ్మవలస మండలం డంగభద్ర రెవెన్యూ పరిధిలో తొలి విడత రీ సర్వేలో భూమి వివరాలు తప్పుగా నమోదయ్యాయని సీపీఎం మండల కార్యదర్శి కురంగి సీతారాం ఆరోపించారు.
ముగ్గురు అన్నాచెల్లెళ్లు సమానంగా పంచుకున్న 1.50 ఎకరాల భూమిని ఒక్కరి పేరుపై నమోదు చేశారని తెలిపారు. పలుమార్లు తహశీల్దార్, వీఆర్వోలకు అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

