Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:16 PM ఆసిఫాబాద్General
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు - Udayam
ఆసిఫాబాద్‌ జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 23,934 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందుగానే గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలు ఎత్తైన ప్రాంతాల్లో, వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉండాలన్నారు. గోనె సంచులు, తూకం, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

Comments

G
Loading comments...