వార్తలకు తిరిగి వెళ్లండి

రఘునాథపాలెం మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఆటలాడుతుండగా ఎనిమిదో తరగతి విద్యార్థి సాత్విక్ (14) ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు సమాచారం.
గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాత్విక్ తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన హరీశ్, ప్రియాంక దంపతుల కుమారుడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

