వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి కేఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన సీఎంవో ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. అలాగే, రిటైర్డ్ ఐఆర్‌ఎస్ అధికారి వేముల శ్రీకర్‌ను రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ సభ్యుడిగా ప్రభుత్వం నియమించింది.
మరో కీలక నిర్ణయంలో, సీఎం ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న బి.అజిత్‌రెడ్డికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) అదనపు మేనేజింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Loading comments...

